
బత్తుల బలరామకృష్ణ గారు గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో బత్తుల గంగారావు, శ్రీమతి గోవిందమ్మ దంపతులకు జన్మించినారు. వారి విద్యాభ్యాసం హైస్కూల్ వరకూ గాదరాడ గ్రామంలో జరిగింది. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయ పనులలో వారి తండ్రిగారికి సహాయంగా ఉండి, వ్యవసాయం చేసినానరు. ఆ తరువాత విజయవాడలో ఒక ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరి, అంచెలంచలుగా ఎదిగి, బ్రాంచ్ మేనేజర్ స్థాయి వరకూ వెళ్ళినారు. అదే సమయంలో డిగ్రీని కరస్పాండెన్స్ ద్వారా అభ్యసించినారు. 1999వ సంవత్సరంలో ఉద్యోగం మానేసి, స్వంతంగా వ్యాపారం ప్రారంభించినారు. వ్యాపార రంగంలో అంచెలంచలుగా ఎదిగి, మొదట జిల్లా స్థాయిలోను, తరువాత రాష్ట్ర స్థాయిలోను, ఆ తరువాత దేశం నలుమూలలా తమ వ్యాపారాన్ని విస్తరింపచేసి, వందల కోట్ల టర్నోవర్ తో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకొని తనకు తాను ప్రత్యేకత చాటుకున్నారు.
మరిన్ని

బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
+91-93849 99999 +91-94827 99999