బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్

బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289

  battularamakrishnagadarada@gmail.com ,   91-9384999999 , 94827 99999.

facebook   instagram   twitter  

క్లుప్తంగా వివరములు

బత్తుల బలరామకృష్ణ గారు గాదరాడ గ్రామం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో బత్తుల గంగారావు, శ్రీమతి గోవిందమ్మ దంపతులకు జన్మించినారు. వారి విద్యాభ్యాసం హైస్కూల్ వరకూ గాదరాడ గ్రామంలో జరిగింది. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయ పనులలో వారి తండ్రిగారికి సహాయంగా ఉండి, వ్యవసాయం చేసినానరు. ఆ తరువాత విజయవాడలో ఒక ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరి, అంచెలంచలుగా ఎదిగి, బ్రాంచ్ మేనేజర్ స్థాయి వరకూ వెళ్ళినారు. అదే సమయంలో డిగ్రీని కరస్పాండెన్స్ ద్వారా అభ్యసించినారు. 1999వ సంవత్సరంలో ఉద్యోగం మానేసి, స్వంతంగా వ్యాపారం ప్రారంభించినారు.

వ్యాపార రంగంలో అంచెలంచలుగా ఎదిగి, మొదట జిల్లా స్థాయిలోను, తరువాత రాష్ట్ర స్థాయిలోను, ఆ తరువాత దేశం నలుమూలలా తమ వ్యాపారాన్ని విస్తరింపచేసి, వందల కోట్ల టర్నోవర్ తో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకొని తనకు తాను ప్రత్యేకత చాటుకున్నారు.

తన పుట్టిన గడ్డకు ఏదైనా సేవ చేయాలనే మంచి ధృక్పథంతో 2012వ సంవత్సరములో నిర్ణయించుకొని, ఒక ట్రస్టును ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా పేద విద్యార్థులకు విద్య, నిరుపేదలకు వైద్యం, గ్రామాల్లో త్రాగునీరు అందించడం మరియు వృద్ధులకు, వితంతువులకు అవసరమైన రీతిలో ఆర్థికంగా (ప్రత్యక్షంగా, పరోక్షంగా) సేవలు చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యాక్రమములన్నింటిని వారి సతీమణీ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు.

అదేవిధంగా వైద్యం నిమిత్తం అనుభవజ్ఞులైన వైద్యులచే మెడికల్ క్యాంపులకు ఏర్పాటు చేయించి, అన్నిరకముల వైద్య పరీక్షలు చేయించి, అవసరమైతే మందులు కూడా ఉచితంగా ఇప్పించడంతో పాటు అత్యవసరమైతే తమ స్వంత ఖర్చులతో ఆపరేషన్లు చేయించడం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు, వితంతువులకు, అంగవైకల్యం గల వారికి తగిన రీతిలో ఆర్ధికంగా (ప్రత్యక్షంగా, పరోక్షంగా) వీలైనంత వరకూ వారికి సేవలు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి, రక్త నిధిని పెంచి, అత్యవసరమైన వారికి ఆ రక్తాన్ని అందించడం, పేద విద్యార్థులకు బుక్స్, పెన్స్ అందించడం, మరియు ఉన్నత చదువులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అంతే కాకుండా సుమారు 50 వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశములు కల్పించినారు. యువతకు చిన్న, చిన్న వ్యాపారాలు స్థాపించుకొనుటకు అవసరమైన ఆర్థికపరమైన సహాయములు అందించి, వారికి అన్నింట్లో మార్గనిర్దేశకులైనారు.

ప్రతీ ఒక్కరికి మానసిక ప్రశాంతత ఉండాలన్న ఉద్దేశ్యంతో ద్యాన పిరమిడను స్థాపించి, మెడిటేషన్/ యోగా నేర్పించడం, అదేవిధంగా 54 హిందూ దేవాలయములు నిర్మంచి, మానవ జాతిని ఆధ్యాత్మిక బావంతో వ్యసనాలకు దూరంగా ఉండి సాంప్రదాయ పద్ధతులలో జీవించుట కొరకు ఏర్పాట్లు చేసినారు. అంతే కాకుండా, 2015 సంవత్సరంలో ఉచిత నిత్య అన్నదానం ఏర్పాటు చేసి, వచ్చినవారందరికి అన్నదానం నిర్విరామంగా చేస్తున్నారు.

ఒక హిందువులకే కాకుండా క్రైస్తవులకు చలు, ముస్లింలకు మసీన్లు నిర్మించినారు. కొన్నింటికి ఆర్థికంగా వారి వంతు సహాయ పడుతుంటారు. జాతీయ నాయకుల జయంతులు, వర్గంతులు, పండుగలు, పర్వదినములు పురష్కరించుకొని, పేదలకు వస్త్రాలు, దుప్పట్లు, పండ్లు మరియు ఆర్ధిక సహాయం చేస్తుంటారు.

పేదింటి ఆడపడుచులకు వివాహాల విషయంలో ఆర్థికంగా సహాయం చేయడం, జీవనోపాధి కోల్పోయిన వారికి ధన, వస్తు సామాగ్రిని అందించడం, అభాగ్యులకు తగిన రీతిలో సహాయపడడం, అనాధ శవాలకు అంత్యక్రియలు జరిపించడం, యాక్సిడెంట్లు అయితే వారికి వైద్య సేవలు ఏర్పాటు చేయడం, పకృతి వైపరిత్యాలలో ప్రజలకు అండగా ఉండడం, లోక కళ్యాణార్థం యజ్ఞాలు, యాగాలు, కళ్యాణాలు, సనాతన ధర్మం ప్రకారం చేయించడం, మొక్కలు నాటించడం, కుల, మత, వర్ల, వర్గ, వయో భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరికి ఏ సమయంలోనైనా, మంచి - చెడూ, వెనక- ముందూ చూడకుండా సేవ చేయడమే మహా భాగ్యమని భావించే మహోన్నత వ్యక్తి మన బత్తుల బలరామకృష్ణగారు.

  1.   54 దేవాలయాలు, వాటితోపాటు నిత్య అన్నదానం, గోశాల, ఉచిత కళ్యాణ మండపం, గో సంరక్షణ సమితి మొదలగు శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహాసంస్థాన ఆశ్రమమును రాజానగరం నియోజక వర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో నిర్మించి గత తొమ్మిది సంవత్సరములుగా ఏవిధమైన ధనాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక సేవా, దైవ సేవా, మానవ సేవా అంటూ పలు సేవలు నిర్వీరామంగా చేయడం జరుగుచున్నది.
  2.   మతాలకు అతీతంగా హిందూ దేవాలయములకే కాకుండా ఒక ప్రత్యేక చర్చిని కూడా నిర్మించి ఒక క్రైస్తవ సంఘానికి అప్పగించి క్రైస్తవులకు ప్రార్థన చేసుకొనుటకు అనుకూలంగా ఉండునట్లు తగిన విధముగా ఏర్పాటు చేయడం జరిగినది .
  3.   చుట్టుప్రక్క గ్రామాలలో దేవాలయాలకు, చర్చిలకు, మసీదుల నిర్మాణముల కొరకు కావాల్సిన తగు గుప్తధానాలు చేయడం జరుగుచున్నది.
  4.    పేద విద్యార్థులకు విద్యను అందించటం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తగిన వైద్య సహాయం చేయడం, అదేవిధంగా అత్యవసర పరిస్థితులలో సొంత డబ్బులతో ఆపరేషన్లు చేయించుట, దహన సంస్కారాలు జరిపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పేదలకు సహాయం చేయుట మరియు పేదింటి ఆడ పిల్లలకు వివాహాలు జరిపించుట మరియు సందర్భానుసారంగా వివిధ సేవా, సహాయ కార్యక్రమాలు చేయుట జరుగుచున్నది .
  5.    కరోనా కష్టకాలంలో ప్రతీరోజు సుమారు 5000 మందికి 63 రోజులు పాటు నిర్విరామంగా సేవలు అందిస్తూ ఫ్రంట్‌లైన్లో పనిచేయు సిబ్బందికి, హస్పటల్ సిబ్బందికి పోలీసు వారికి, శానిటేషన్ వారికి, రెవెన్యూ సిబ్బందికి, పాదచారులకు, బాటసారులకు, రవాణా డైవర్లకు, అన్ని వర్గాల ప్రజలకు, ఆహారం కోసం పరితపిస్తున్న బిచ్చగాళ్ళకు, మొదలగువారికి ఆహార పొట్లాలను అందించడం జరిగినది .
  6.   గాదరాడ మరియు చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలకు కరోనా కష్టకాలంలో కిరాణా వస్తువులు, కూరగాయలు, పలు రకాల నిత్యావసర వస్తువులు ప్యాకెట్లుగా తయారు చేసి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది .
  7.   కరోనా పేషేంట్లకు దగ్గరుండి వైద్య చేయించడం, అలాగే కరోనాతో మరణించిన వారికి దహనక్రియలకు పలు రకాలుగా అవసరమైనటువంటి సేవలు అందించడం జరిగినది.
  8.    ఆనందయ్య గారి ఆయుర్వేద ఫార్ములా మందును సుమారు జిల్లా వ్యాప్తంగా మరియు ప్రక్క జిల్లాలో కలిపి సుమారు ల మందికి పంపిణీ చేయడం జరిగింది .
  9.    కరోనా పాండమిక్ పరిస్థితులలో సొంత మనుషులతో, సొంత ఖర్చులతో వివిధ శానిటైజేషన్ మెటీరియల్ ఉపయోగించి శానిటైజేషన్ చేయించడం జరిగినది .
  10.   మెడికల్ క్యాంపులు పెట్టి సమర్ధవంతమైన అనుభవజ్ఞలైన అర్హతలు కలిగినటువంటి డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు కూడా ఇప్పించడం ఏదైనా సివియర్ గా ఉన్నవారికి హస్పిటల్‌కు పంపించి వైద్యం చేయించి అవసరమైన సేవలు అందించడం జరిగినది.
  11.   గ్రామంలో ప్రజల సౌకర్యార్ధం విద్యుత్ స్థంభాలు, త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేసి, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది.

బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289

+91-93849 99999
+91-94827 99999