బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
battularamakrishnagadarada@gmail.com , 91-9384999999 , 94827 99999.

మండల హెడ్ క్వార్టర్‌లో మెడికల్ క్యాంపులు, అనుభవజ్ఞులు అయిన డాక్టర్లు, అన్ని రకముల వైద్య సేవలు అందించు స్పెషలిస్టులచే అవసరమైన వివిధ రకముల పరీక్షలు చేయించి, తగిన మందులు కూడా ఉచితంగా ఇప్పంచడంతో పాటు అత్యవసరం అయితే స్వంత ఖర్చులతో ఆపరేషన్లు చేయించడం, కృత్రిమ అవయవాలను అందించేందుకు కృషి చేయడం, ప్రత్యేక్షంగాను మరియు పరోక్షంగాను పలు రకముల ఆర్ధిక సేవలు అందింస్తుంటారు.
యాక్సిడెంట్ కేసులకు తక్షణం స్పందించడం, మరియు విషసర్పములు వలన ప్రమాదానికి గురై ఇబ్బంది పడేవారికి అత్యవసర వైద్యాన్ని అందించడం మరియు యాక్సిడెంట్ లలో గానీ, వివిధ ప్రమాదాలలో చనిపోయినవారి శవాలకు పోస్టుమార్టం, పంచనామాలకు పత్యేక్షంగాను మరియు పరోక్షంగాను సహాయ పడడం.
రక్త దాన క్యాంపులు నిర్వహించి, తద్వారా రక్త నిధిని పెంచి, రక్తం అవసరమైన వారికి రక్తాన్ని ఉపయోగించుకొనే విధంగా ఏర్పాటు చేయడం.
ఎనేమియా లాంటి దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించటం, అత్యవసర పరిస్థితులలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి వైద్య సేవలైనా అందించేందుకు సిద్ధంగా ఉంటారు.
బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
+91-93849 99999 +91-94827 99999